Skip to main content

Namaste NRI

డొనాల్డ్‌ ట్రంప్‌ దెబ్బకు దిగొచ్చిన కొలంబియా

కొలంబియా ఉత్పత్తులపై సుంకాలు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన హెచ్చరికలకు కొలంబియా దిగొచ్చింది. అగ్రరాజ్యం పెట్టిన నిబంధనలకు అంగీకరించింది. ఈ విషయాన్ని వైట్‌హౌస్‌ తాజాగా వెల్లడించింది.

అమెరికాలో ఉన్న అక్రమ వలసదారులపై ట్రంప్‌ కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. వారందరినీ ప్రత్యేక విమానాల్లో స్వదేశాలకు పంపిస్తున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్‌ చర్యను కొలంబియా తీవ్రంగా వ్యతిరేకించింది. వలసలతో వస్తున్న అమెరికా సైనిక విమానాలను తమ దేశంలోకి అనుమతించేది లేదని ఆ దేశాధ్యక్షుడు గుస్తావో పెట్రో  స్పష్టం చేశారు. వలసదారులన గౌరవంగా పంపించేందుకు నిబంధనలు రూపొందిస్తేనే వాటిని అనుమతిస్తామని తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే తమ దేశంలోకి వచ్చిన అమెరికా సైనిక విమానాలను వెనక్కి పంపినట్లు చెప్పారు. అయితే, గుస్తావో పెట్రో నిర్ణయంపై ట్రంప్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుంకాలతో పాటు కఠిన వీసా ఆంక్షలు విధిస్తామని ట్రంప్‌ హెచ్చరించారు. కొలంబియా ఉత్పత్తులపై సుంకాలు 50 శాతానికి పెంచుతున్నట్లు కీలక ప్రకటన చేశారు. అంతేకాదు కొలంబియన్‌ ప్రభుత్వ అధికారుల వీసాలను వెంటనే రద్దు చేస్తానని తెలిపారు. ఈ క్రమంలోనే కొలంబియా దిగొచ్చినట్టు తెలుస్తోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events