Namaste NRI

కలర్‌‌ఫుల్‌గా లాంచ్ అయ్యిన మై సౌత్ దివా క్యాలెండర్ 2025

ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ మనోజ్‌ కుమార్‌ కటోకర్‌ రూపొందించిన సౌత్‌ దివా క్యాలెండర్‌ను హైదరాబాద్‌లో ఆవిష్కరించా రు. ఇందులో శ్రియా శరన్‌, కేథరిన్‌ థెరిస్సా, కాజల్‌ అగర్వాల్‌, మాళవికా శర్మ, తాన్య హోప్‌, ఐశ్వర్యకృష్ణ, కుషిత, వినాలీ భట్నాగర్‌, రియా సచ్‌దేవ్‌, కనికమాన్‌, పలక్‌ అగర్వాల్‌ భాగమయ్యారు.

ఈ కార్యక్రమానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ జ్ఞానశేఖర్‌, దర్శకులు కరుణ కుమార్‌, సుజనా రావు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్యాలెండర్‌ రూపకర్త, ఫొటోగ్రాఫర్‌ మనోజ్‌ కుమార్‌ కటోకర్‌ మాట్లాడుతూ తొమ్మిదేళ్లుగా ఈ క్యాలెండర్‌ను తీసుకొస్తున్నాం. 12 మంది కథానాయికలతో కూడిన ఈ క్యాలెండర్‌ అందరికి నచ్చుతుందనుకుం టున్నా. ఈ ఏడాది ఐదుగురు కొత్త మోడల్స్‌ను క్యాలెండర్‌ ద్వారా పరిచయం చేశాం అన్నారు. క్యాలెండర్‌ను చక్కటి డిజైన్స్‌తో అందంగా ముస్తాబు చేశారని సినిమాటోగ్రాఫర్‌ జ్ఞానశేఖర్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో క్యాలెండర్‌లో భాగమైన కథానాయికలందరూ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events