Namaste NRI

తెలుగులో విడుదలకు సిద్ధమైన రాక్షస

కన్నడ హీరో ప్రజ్వల్‌దేవ్‌రాజ్‌ నటిస్తున్న తాజా చిత్రం రాక్షస. టైమ్‌ లూప్‌ కాన్సెప్ట్‌ హారర్‌ మూవీగా తెరకెక్కించారు. లోహిత్‌ హెచ్‌ దర్శకుడు. ఈ చిత్రాన్ని కామాక్షి కోల్‌కతా కాళీ క్రియేషన్స్‌ పతాకంపై ఎంవీఆర్‌ కృష్ణ తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో హీరో ప్రజ్వల్‌ దేవ్‌రాజ్‌,  కూతురిని అమితంగా ప్రేమించే తండ్రిగా కనిపించారు. తండ్రీకూతురు అనుబంధం నేపథ్యంలో డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించామ ని, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుంద ని మేకర్స్‌ తెలిపారు. తెలుగు ప్రేక్షకులు మెచ్చే వినూత్న కథాంశంతో ఈ సినిమా రాబోతున్నదని దర్శకుడు తెలిపారు. అరుణ్‌రాథోడ్‌, శ్రీధర్‌, గౌతమ్‌, సోమశేఖర్‌, విహాన్‌కృష్ణ తదితరులు నటిస్తున్నారు. ఫిబ్రవరి 26న కన్నడంతో పాటు తెలుగులో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: నోబిల్‌పాల్‌, దర్శకుడు: లోహిత్‌ హెచ్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events