ఆది సాయి కుమార్ హీరోగా రూపొందుతోన్న సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ శంబాల ఏ మిస్టిక్ వరల్డ్. స్వాసిక హీరోయిన్గా నటించారు. తాజాగా స్వాసిక ఫస్ట్ లుక్ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాను షైనింగ్ పిక్చర్స్ బ్యానర్పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తుండగా, యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుండి స్వాసిక ఫస్ట్ లుక్ పోస్టర్ని మేకర్స్ వదిలారు. వసంత పాత్రలో స్వాసిక శంబాల చిత్రంలో కనిపించనుంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో ఎరుపు రంగు చీరలో స్వాసిక కనిపించిన తీరు, ఆమె చూపులు, చుట్టూ ఉన్న వాతావరణం, పక్షి, దిష్టిబొమ్మ ఇలా అన్నింటినీ చూస్తుంటే సినిమా మీద మరింత ఆసక్తి ఏర్పడుతోంది.
శంబాల విషయానికి వస్తే ఈ చిత్రం సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్తో రాబోతోంది. ఈ మూవీలో ఆది సాయి కుమార్ భౌగోళిక శాస్త్రవేత్తగా ఓ ఛాలెంజింగ్ రోల్లో కనిపించనున్నారు. అత్యంత భారీ బడ్జెట్తో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో వీఎఫ్ఎక్స్ ప్రధాన ఆకర్షణ కానున్నాయని.. ప్రస్తుతం హైదరాబాద్లోని ఆర్ఎఫ్సిలో ప్రత్యేకంగా రూపొందించిన సెట్లో శంబాల సినిమాను చిత్రీకరిస్తున్నట్లుగా మేకర్స్ తెలిపారు.