విశ్వక్సేన్ హీరోగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన చిత్రం లైలా. ఆకాంక్షశర్మ కథానాయిక. ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్కి అతిథిగా విచ్చేసిన చిరంజీవి మాట్లాడారు. నువ్వు బాలకృష్ణ కాంపౌండ్ కదా, మెగా కాంపౌండ్కి ఎప్పుడెళ్లావ్ అని ఎవరో అంటే నా ఇంటికి కాంపౌండ్ వాల్ ఉంది కానీ, ఇండస్ట్రీకి లేదు అని సమాధానమిచ్చాడు విశ్వక్. అతని సమాధానం నాకు నచ్చింది. తను చెప్పింది నిజం. ఇండస్ట్రీ ఒకే కుటుంబం. మేమంతా ఒకటే కాంపౌండ్. ఇక ఈ సినిమా విషయానికొస్తే ట్రైలర్ చూస్తేనే అర్థమైంది సినిమా హిట్ అని విశ్వక్ లేడీ గెటప్ సూపర్. తను బహుముఖ ప్రజ్ఞాశాలి.తప్పకుండా పెద్దస్థాయికి వెళ్తాడు అని అన్నారు.
విశ్వక్సేన్ మాట్లాడుతూ నన్ను నమ్మి ఈ కథను నా దగ్గరకు తెచ్చిన దర్శకనిర్మాతలకు థ్యాంక్స్. కథ నారేట్ చేసేటప్పుడే నవ్వించేవాడు డైరెక్టర్ రామ్నారాయణ్. దానికి తగ్గట్టే తెరపై నేను నవ్వించానని అనుకుంటున్నా. అన్నదానం ఎంత గొప్ప పనో అందర్నీ నవ్విండం పంపడం అంత గొప్ప పని . ఈ సినిమా ద్వారా మేం చేయబోయేది అదే అన్నారు. ఈ కార్యక్రమంలో అనిల్ రావిపూడితో పాటు చిత్ర యూనిట్ మొత్తం పాల్గొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/uk-300x160.jpg)