ఇజ్రాయెలీ బందీలను వచ్చే శనివారం మధ్యాహ్నం 12 గంటలలోగా విడిచిపెట్టాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, యుద్ధ విరమణ ఒప్పందాన్ని రద్దు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలపై హమాస్ మిలిటెంట్స్ స్పందించారు. యుద్ధ విరమణ ఒప్పందాన్ని ఇరువర్గాలు గౌరవించాలనే విషయాన్ని ట్రంప్ తప్పక గుర్తుంచుకోవాలని హమాస్ నేత సమీ అబూ జుహ్రి వ్యాఖ్యానించారు.
బెదిరింపు పదజాలానికి ఎలాంటి విలువ ఉండదని, అది విషయాన్ని మరింత జఠిలం చేస్తుందని జుహ్రి అన్నారు. రెండు వైపుల ఉన్న బందీలు విడుదల కావాలంటే ఇరువర్గాలు యుద్ధ విరమణ ఒప్పందాన్ని గౌరవించడం ఒక్కటే మార్గమని ఆయన పేర్కొన్నారు. కాగా ఇజ్రాయెలీ బందీలను విడుదల చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్ రెబెల్స్ గ్రూప్‌కు డెడ్‌లైన్ విధించారు. హమాస్ మాట వినకపోతే యుద్ధ విరమణ ఒప్పందాన్ని రద్దు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు ఇచ్చారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/gautamadani-300x160.jpg)