బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా విదేశాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. కేసీఆర్ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం డెలివరీ రాష్ట్రం అమెరికాలో బీఆర్ఎస్ యూఎస్ఏ, హెల్పింగ్ హాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టెల్ మార్వా బ్లడ్ బ్యాంక్ సెంటర్లో ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరానికి ఎన్నారైలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రాణదాతలు కావాలని మేమంతా కోరుతున్నాను. ఈ రక్తదాన శిబిరం బీఆర్ఎస్ యూఎస్ఏ, భాస్కర్ పిన్న, టీమ్ సభ్యులచే నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే 20 నుంచి 25 మంది దాతలు తమ యొక్క పేర్లను నమోదు చేసుకుని తోటి వారి యొక్క ప్రాణాలకు ప్రాణదాతలుగా నిలబడుతున్నారు. రక్తదాన శిబిరానికి వచ్చి రక్తదానం చేసిన ప్రతి సభ్యుడికి బీఆర్ఎస్ యూఎస్ఏ కృతజ్ఞత అభివందనాలు తెలిపారు.
