
జీవీ ప్రకాశ్ కుమార్, దివ్యభారతి జంటగా నటిస్తున్న చిత్రం కింగ్‌స్టన్. కమల్ ప్రకాశ్ దర్శకత్వం. జీవీ ప్రకాశ్ నటించడంతో పాటు నిర్మాతగా, సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. గంగ ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత మహేశ్వర్ రెడ్డి తెలుగులో సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో నితిన్ మాట్లాడుతూ ట్రైలరే ఇంత గొప్పగా ఉంటే, సినిమా ఏ స్థాయిలో ఉంటుందో అనే ఆసక్తిని పెంచింది అని అన్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ మాట్లాడుతూ ఈ చిత్రం ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందిస్తుంది అని అన్నారు. నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ ఇలాంటి అద్భుతమైన సినిమాని థియేటర్లలోనే చూడాలి అని అన్నారు. ఈ చిత్రం ఈనెల 7న విడులవుతోంది.
