Namaste NRI

కింగ్‌స్టన్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌

జీవీ ప్రకాశ్‌ కుమార్‌, దివ్యభారతి జంటగా నటిస్తున్న చిత్రం కింగ్‌స్టన్‌.  కమల్‌ ప్రకాశ్‌ దర్శకత్వం. జీవీ ప్రకాశ్‌ నటించడంతో పాటు నిర్మాతగా, సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.  గంగ ఎంటర్‌టైన్‌మెంట్‌ అధినేత మహేశ్వర్‌ రెడ్డి తెలుగులో సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. హీరో నితిన్‌ మాట్లాడుతూ ట్రైలరే ఇంత గొప్పగా ఉంటే, సినిమా ఏ స్థాయిలో ఉంటుందో అనే ఆసక్తిని పెంచింది అని అన్నారు. జీవీ ప్రకాశ్‌ కుమార్‌ మాట్లాడుతూ ఈ చిత్రం ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందిస్తుంది అని అన్నారు. నిర్మాత రవిశంకర్‌ మాట్లాడుతూ ఇలాంటి అద్భుతమైన సినిమాని థియేటర్లలోనే చూడాలి అని అన్నారు. ఈ చిత్రం ఈనెల 7న విడులవుతోంది.

Social Share Spread Message

Latest News