ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన సమయమని ప్రవాసాంధ్రులకు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది, ఎన్టీఆర్ సినీరంగ ప్రవేశం చేసి 75 వసంతాల పూర్తయిన సందర్భాల్ని పురస్కరించుకొని అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం జాక్సన్ విల్లే నగరంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ పరిశ్రమలు, కంపెనీలు ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం కొత్త పరిశ్రమలు తీసుకురాకపోగా, ఉన్నవాటినీ తరిమేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు భరోసా కల్పించేలా పాలసీలు రూపొందించింది. జగన్ భూతాన్ని చూసి భయపడాల్సిన పనిలేదు అని అన్నారు.

మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ పేదరిక నిర్మూలన కోసం చంద్రబాబు ప్రకటించిన పీ4లో ప్రవాసాంధ్రులు కూడా భాగస్వాములు కావాలని కోరారు. ఈ కర్యాక్రమంలో నాగేశ్వరరావు, గోపాల్, రాజేశ్, హరీశ్‌కుమార్ వీరవల్లి, ఆనంద్ వక్కలగడ్డ, అనిల్ యార్లగడ్డ, ఆనంద్ తోటకూర, సుమంత్ ఈదర తదితరులు పాల్గొన్నారు.















