అమెరికాలో మరో భారతీయుడు అందులోనూ తెలుగు వ్యక్తి ఉన్నత స్థానాన్ని పొందారు. అమెరికా వాణిజ్య, అభివృద్ధి సంస్థ (యూఎస్‌టీడీఏ) ముఖ్య కార్యనిర్వహణాధికారిగా (సీవోవో), డిప్యూటీ డైరెక్టర్‌గా హైదరాబాద్‌కు చెందిన తుమ్మలపల్లి వినయ్ నియమితులయ్యారు. ఈ మేరకు అధ్యక్షుడు జో బైబెన్ నిర్ణయం తీసుకున్నారు. 1974లో చదువు కోసం అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. 2009`13 వరకు బెలీజ్ దేశానికి అమెరికా రాయబారిగా పని చేశారు. అమెరికా చరిత్రలోనే తొలి భారతీయ అమెరికన్ రాయబారిగా అప్పట్లో ఆయన పేరు మారుమోగింది. ప్రైవేటు రంగంలో 30 ఏళ్లకు పైగా తుమ్మలపల్లికి అనుభవం ఉందని యూఎస్‌టీడీఏ ఈ సందర్భంగా తెలిపింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)