Skip to main content

Namaste NRI

బైడెన్ టీమ్‌లోకి మరో భారతీయుడు .. కీలక పదవికి నామినేట్

అమెరికాలో మరో భారతీయుడు అందులోనూ తెలుగు వ్యక్తి ఉన్నత స్థానాన్ని  పొందారు. అమెరికా వాణిజ్య, అభివృద్ధి సంస్థ (యూఎస్‌టీడీఏ) ముఖ్య కార్యనిర్వహణాధికారిగా (సీవోవో), డిప్యూటీ డైరెక్టర్‌గా హైదరాబాద్‌కు చెందిన తుమ్మలపల్లి వినయ్‌ నియమితులయ్యారు. ఈ మేరకు అధ్యక్షుడు జో బైబెన్‌ నిర్ణయం తీసుకున్నారు. 1974లో చదువు కోసం అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. 2009`13 వరకు బెలీజ్‌ దేశానికి అమెరికా రాయబారిగా పని చేశారు. అమెరికా చరిత్రలోనే తొలి భారతీయ అమెరికన్‌ రాయబారిగా అప్పట్లో ఆయన పేరు మారుమోగింది. ప్రైవేటు రంగంలో 30 ఏళ్లకు పైగా తుమ్మలపల్లికి అనుభవం ఉందని యూఎస్‌టీడీఏ ఈ సందర్భంగా తెలిపింది.

Social Share Spread Message

Latest News