Namaste NRI

మరో ప్రామిసింగ్ స్టార్ ఇండస్ట్రీకి :  శివరాజ్ కుమార్

గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు  కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతున్న చిత్రం  జూనియర్‌.  రాధా కృష్ణ దర్శకత్వం.  శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ బెంగళూరులో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కిరీటీ నాకు చిన్నప్పటినుంచి తెలుసు. జూనియర్ టీజర్, ట్రైలర్,పాటలు చూశాను. కిరీటి చాలా అద్భుతంగా డాన్స్ చేశాడు. తన పెర్ఫార్మన్స్ చాలా బాగుంది. కిరిటి రూపంలో మరో ప్రామిసింగ్ స్టార్ ఇండస్ట్రీకి వస్తున్నాడు. తను డాన్స్ లో సూపర్ సీనియర్ అనిపిస్తున్నారు. శ్రీలీల కూడా మంచి డ్యాన్సర్. వారి కెమిస్ట్రీ చాలా బాగుంది. జెనీలియా గుడ్ హ్యూమన్ బీయింగ్. తను ఈ సినిమాలో చాలా చక్కని పాత్ర పోషించారు. రవిచంద్రన్ తో నాకు ఎప్పటినుంచో స్నేహం ఉంది. ఆయన ఈ సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్ చేస్తున్నారు. డైరెక్టర్ సినిమాని చాలా అద్భుతంగా తీశారని ప్రమోషనల్ కంటెంట్ చూస్తే అర్థమవుతుంది. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ సూపర్ స్టార్. జూలై 18న రిలీజ్ అవుతున్న సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను  అన్నారు. జూలై 18న ఈ సినిమా రిలీజ్ కానుంది.   ఈ కార్యక్రమంలో  గాలి జనార్దన్ రెడ్డి, కిరీటి,  శ్రీలీల , జెనీలియా, రవిచంద్రన్‌, సాయి కొర్రపాటి, సెంథిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News