
దర్శకుడు నరసింహ నంది రూపొందిస్తున్న తాజా చిత్రం ప్రభుత్వ సారాయి దుకాణం. దైవ నరేష్ గౌడ, పరిగి స్రవంతి మల్లిక్ నిర్మాతలు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. షేక్‌స్పియర్ కథలోని పాత్రలను ఆధారంగా తీసుకొని తెలంగాణలోని ఓ మారుమూల ప్రాంతంలో జరిగే పొలిటికల్ ఫ్యామిలీ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, పగ, ద్వేషం, అసూయ, ప్రేమ వంటి వివిధ భావోద్వేగాలను ఆవిష్కరిస్తూ ఈ సినిమా సాగుతుందని, 1980ల నాటి పరిస్థితులను కళ్లకు కట్టామని దర్శకుడు నరసింహ నంది తెలిపారు. మూడేళ్లు ఎంతగానో శ్రమించి ఈ సినిమాను తెరకెక్కించామని, తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్, రచన-దర్శకత్వం: నరసింహ నంది.బ్యానర్: ఎస్విఎస్ ప్రొడక్షన్, శ్రీనిధి సినిమాస్, నిర్మాతలు: దైవ నరేష్ గౌడ, పరిగి స్రవంతి మల్లిక్ , ఎడిటర్ : వి. నాగిరెడ్డి, కెమెరామెన్: ఎస్.మురళి మోహన్ రెడ్డి.















