
అమెరికాలోని ఈక్యూ ఫర్ పీస్ వరల్డ్ వైడ్‌సంస్థ వైస్ ప్రెసిడెంట్‌గా విశాఖకు చెందిన డాక్టర్ చల్లా కృష్ణవీర్ అభిషేక్ ఎంపికయ్యారు. ఈ మేరకు సంస్థ అధ్యక్షుడు ప్రొఫెసర్ మాట్ పెరెల్ స్టెయిన్ అధికారికంగా సమాచారం ఇచ్చినట్లు కృష్ణవీర్ వెల్లడిరచారు. ప్రపంచ వ్యాప్తంగా యువతలో సానుకూల మానసిక ఆరోగ్యం, భావోద్వేగ మేధస్సు, కోపం లేని జీవనం, అంతర్గత శాంతిని ప్రోత్సహించడానికి ఈక్యూ ఫర్ పీస్ సంస్థ పని చేస్తోందని కృష్ణవీర్ అభిషేక్ తెలిపారు. డాక్టర్ కృష్ణవీర్ ఆంధ్ర యూనివర్సిటీతో పాటు వివిధ విద్యాలయాల్లో విద్యార్థుల అభ్యున్నతి, వ్యక్తిత్వ వికాసానికి దోహదపడేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈక్యూ ఫర్ పీస్ సంస్థ వైస్ ప్రెసిడెంట్‌గా ప్రపంచ వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించే అవకాశం లభించడం వల్ల కృష్ణవీర్‌ను పలువురు అభినందించారు.















