గ్రీన్‌లాండ్‌ని స్వాధీనం చేసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెన్మార్క్‌పై తన ఒత్తిడిని తీవ్రతరం చేశారు. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఆర్కిటిక్ భూభాగంపై రష్యా ముప్పును తిప్పికొట్టడంలో డెన్మార్క్ విఫలమైందని ట్రంప్ ఆరోపించారు. ఇప్పుడు ఇక అమెరికా చర్యలు తీసుకునే సమయం ఆసన్నమైందని ఆయన ప్రకటించారు. గ్రీన్‌లాండ్‌కి రష్యా ముప్పును దూరం చేయాలని నాటో గత 20 సంవత్సరాలుగా డెన్మార్క్‌కు చెబుతున్నది. దురదృష్టవశాత్తు డెన్మార్క్ దాని గురించి ఏమీ చేయలేకపోయింది. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఇక అదే జరుగుతుంది అని అన్నారు.

గ్రీన్లాండ్ విషయంలో డెన్మార్క్‌కు మద్దతు ఇస్తున్న దేశాలపై కొత్త సుంకాలు విధిస్తూ ట్రంప్ ప్రకటన చేసిన తర్వాత అమెరికా, యూరోపియన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో ట్రంప్ నుంచి వెలువడిన ఈ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.















