Skip to main content

Namaste NRI

ఆత్రేయపురం బ్రదర్స్ మూవీ ప్రారంభం

రాజీవ్‌ కనకాల, గవిరెడ్డి, సన్నీ పత్సా, రఘుబాబు తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఆత్రేయపురం బ్రదర్స్‌ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రాజేష్‌ జగన్నాథం దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు వశిష్ట క్లాప్‌నివ్వగా, విజయ్‌ కనకమేడల కెమెరా స్విఛాన్‌ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన కాన్సెప్ట్‌ పోస్టర్‌ ఆకట్టుకునేలా ఉంది. గ్రామీణ నేపథ్యంలో ఇద్దరు వ్యక్తుల మధ్య వైరం నేపథ్యంలో సాగే వినోదాత్మక కథ ఇదని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సంతు ఓంకార్‌, నిర్మాతలు: సంజీవ్‌, వంగపల్లి సందీప్‌, సంకీర్త్‌, ప్రవీణ్‌ గద్దె, రాజేష్‌ గద్దె, రాకేష్‌, రచన, దర్శకత్వం: రాజేష్‌ జగన్నాథం.

Social Share Spread Message

Latest News