Skip to main content

Namaste NRI

వరుణ్ సందేశ్ హలో ఇట్స్ మీ.. టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల

వరుణ్‌సందేశ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం హలో ఇట్స్‌ మీ. షగ్నశ్రీ వేణున్‌ కథానాయికగా నటిస్తూ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నది. దర్శన్‌ మదమంచి మరో హీరో. వీఎస్‌కే సంజీవ్‌, వంగపల్లి సందీప్‌, వంగపల్లి సంకీర్త్‌ నిర్మాతలు. ప్రస్తుతం షూటింగ్‌ చివరి దశలో ఉంది. ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను లాంచ్‌ చేశారు. వరుణ్‌సందేశ్‌ మాట్లాడుతూ చాలాకాలంగా థ్రిల్లర్‌ సినిమాలే చేస్తున్న నాకు ఈ సినిమా ఓ మార్పు. ఇది చక్కటి కుటుంబ కథ. అపార్థాల వల్ల ఓ జంట ఎలాంటి ఇబ్బందులు పడ్డారనే ప్రశ్నకు సమాధానమే ఈ సినిమా. నా హ్యాపీడేస్‌, కొత్త బంగారులోకం పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. ఇందులోని పాటలు కూడా కొన్నాళ్ల పాటు వినిపిస్తాయి అని చెప్పారు. ప్రతి అమ్మాయికీ, ప్రతి అబ్బాయికీ రిలేటయ్యే కథ ఇదని చిత్ర కథానాయిక, డైరెక్టర్‌ షగ్న శ్రీవేణున్‌ అన్నారు.

Social Share Spread Message

Latest News