
స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ ప్రభుత్వం లైఫ్ సైన్స్ స్ పాలసీని విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఈ పాలసీని ఆవిష్కరించారు. 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు లక్ష్యంగా ఈ పాలసీ ని రూపొందించారు. ఈ రంగంలో 5 లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రణాళికను తయారు చేసింది. ఉత్తమ పరిశోధనలు, అధునాతన బయో లాజిక్స్ కు ప్రాధాన్యం ఇవ్వనుంది. థెరపీతో పాటు పర్యావరణహిత ఉత్పత్తులు ప్రాదాన్యంగా పాలసీని రూపొందించారు.















