Skip to main content

Namaste NRI

సింగపూర్‌లో వైభవంగా వాసవి జయంతి పూజా కార్యక్రమాలు

సింగపూర్: వాసవి క్లబ్ మెర్లియన్ సింగపూర్(VCMS) ఆధ్వర్యంలో వాసవి జయంతి పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. సింగపూర్ లోని అత్యంత పురాతన మరియమ్మన్ దేవాలయంలో సుమారు 500 మంది ఆర్య వైశ్యలు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వాసవి జయంతి పూజలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా అలరించాయి. కన్యా పూజతో మొదలై సుమారు 200 మంది మహిళలు అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. సాయంత్రం అమ్మ వారి ఊరేగింపు వైభవంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తొలిసారిగా వీసిఎంయస్( VCMS) ఆధ్వర్యంలో ఆర్య వైశ్యుల కోసం ఒక వివాహ వేదికను ఏర్పాటు చేశారు. గోకవరపు లీల- సూర్య ప్రకాష్, బచ్చు కిరణ్మయి- ప్రసాద్, సుమలత – గోపి కిషోర్, ముక్కు సుకన్య – ఇంద్రయ్య, మంచికంటి స్వప్న- శ్రీధర్, సంకిరెడ్డిపల్లి రాగిణి- విక్రమ్, కర్ణాటి శేష – శ్రీనివాస్ రావు, దిన్నేపల్లి సుజాత- సురేష్, మోహిని లతా- రమేష్, పుల్లరి మైత్రి- శ్రీకాంత్, ఇమ్మడి శెట్టి అరుణ- వంశీ కృష్ణ, నారాయణమ్ అలేఖ్యా – జానకిరామ్, పులవర్తి లక్ష్మి- నాగ సురేష్, తీగల సహన- సందీప్, కోరుకొండ అపర్ణ- రవి కుమార్, నంబురి వెంకట శ్రీనివాసరావు- విజయ, మాడిశెట్టి సరిత- రామ్ శెట్టి తదితర ఉభయ దాతలు అమ్మవారికి విశేష పూజలు చేశారు.

వాసవి క్లబ్ మెర్లియన్ సింగపూర్ సీనియర్ కమిటీ సభ్యుడైన ముక్కా కిశోర్ ఆధ్వర్యంలో వాసవీ జయంతి వైభవంగా జరిగింది. కమిటీ సభ్యులైన పబ్బతి మురళి కృష్ణ, సుమన్ రాయల, కటకం మార్తండ, స్వప్న మంచికంట , జయ కుమార్, వినయ్ బంటుర్, మకేష్ భూపతి, శివ కిషన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఇంత వైభవంగా జరగడానికి సహకరించిన ఉభయ దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క ఆర్య వైశ్యునికి వాసవి సేవాదల్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events