Namaste NRI

సింగ్ గీతం నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్

ప్రఖ్యాత దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన విభిన్న కథా చిత్రం సింగ్‌ గీతం. భారతదేశపు తొలి మ్యూజికల్‌ ఫాంటసీగా రూపొందిన ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని వైజయంతీ మూవీస్‌ సమర్పణలో, స్వప్న సినిమా పతాకంపై నాగ్‌అశ్విన్‌ నిర్మించారు. ఒక దిగ్గజ దర్శకుడు, ఒక లెజెండరీ నిర్మాణ సంస్థ కలిసి రూపొందించిన ఈ చిత్రం ద్వారా అయాన్‌, అహల్య బమ్రూ, శాలిని కొండేపూడి ప్రధాన పాత్రధారులుగా పరిచయం అవుతున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని ఏమైంది.. ఏమైంది.. బాబోయ్‌ ఏదో అయిపోయింది అంటూ సాగే పాటను స్టార్‌ హీరోయిన్‌ శ్రుతిహాసన్‌ విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ఓ వింత పరిస్థితుల్లో చిక్కుకున్న గ్రామాన్ని పరిచయం చేస్తూ ఓ పజిల్‌గా ఈ పాట సాగింది. ఆ గ్రామంలో సాధారణ సంభాషణలన్నీ పాటగా మారిపోతాయి. ఎందుకలా జరిగిందో అర్థంకాకపోయినా, గ్రామస్తులంతా ఆ పరిస్థితికి అలవాటు పడాల్సొస్తుంది. ప్రశ్నలు, సందేహాలు, ఆశ్చర్యాలన్నీ ట్యూన్స్‌గా మారిపోతూ వినోదాన్ని పంచుతాయి. దేవిశ్రీప్రసాద్‌ స్వరపరిచిన ఈ పాటను చిత్రంలో నటించిన నటీనటులే ఆలపించడం విశేషం. శ్రీమణి, దేవిశ్రీప్రసాద్‌, గౌతమ్‌ చల్లగుల్ల, రత్న శ్రీకర్‌, శశాంక్‌ చింతలపూడి కలిసి రాసిన ఈ పాట సినిమాలోని విచిత్ర పరిస్థితిని ప్రజెంట్‌ చేస్తుంది. జూన్‌ 11న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events