Namaste NRI

ఈ సినిమా తన కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌ : దినేష్‌తేజ్‌

మర్డర్‌ మిస్టరీ నేపథ్య కథాంశంతో రూపొందుతున్న చిత్రం తత్వం. దినేష్‌తేజ్‌, దష్విక జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి అర్జున్‌ కోల దర్శకుడు. వంశీ చీమకుర్తి, శ్వేత పసుపులేటి నిర్మాతలు. ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రమిదని, మన చుట్టూ జరుగుతున్న సంఘటనల స్ఫూర్తితో కథ తయారుచేసుకున్నానని, వంశీ అన్వేషణ తరహాలో ఆకట్టుకుంటుందని దర్శకుడు అర్జున్‌ కోలా తెలిపారు.

ఈ సినిమా తన కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌లా నిలుస్తుందనే నమ్మకం ఉందని, కథలోని మలుపులు సర్‌ప్రైజింగ్‌గా ఉంటాయని హీరో దినేష్‌తేజ్‌ పేర్కొన్నారు. థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ చేయాల్సిన సినిమా ఇదని నిర్మాత వంశీ సీమకుర్తి తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: భరత్‌ పట్టి, సంగీతం: చేతన్‌ భరద్వాజ్‌, దర్శకత్వం: అర్జున్‌ కోల.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events