పశ్చిమ ఆఫ్రికాలోని నైగర్ లో అధ్యక్షుడు మహ్మద్ బజౌమ్‌కు వ్యతిరేకంగా సైన్యం ఇటీవల తిరుగుబాటు చేసింది. ఈ నేపథ్యంలో ఆ దేశంలోని ప్రవాసాంధ్రులు తక్షణమే తిరిగిరావాలంటూ ఏపీఎన్‌ఆర్టీఎస్ హెచ్చరికలు జారీ చేసింది. ప్రవాసాంధ్రుల కోసం రెండు హెల్ప్‌లైన్ నెంబర్లు ఏర్పాటు చేసినట్టు ఏపీ ఎన్‌ఆర్టీఎస్ సీఈవో తెలిపారు. నైగర్‌లోని ఆ దేశ అధ్యక్షుడిపై అక్కడి సైన్యం తిరుగుబాటు చేసిన నేపథ్యంలో విమాన రాకపోకలు నిలిపివేసినట్టు విదేశాంగ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నైగర్‌లో ఎయిర్ స్పేస్ మూసివేయటంతో భూమార్గ సరిహద్దుల ద్వారా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచనలు జారీ చేసింది. నైజర్‌లోని భారతీయులంతా నియామీలోని భారత రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోవాలని తెలిపింది. భారతీయ పౌరుల సహాయం కోసం +227 9975 9975 అత్యవసర నెంబర్ ఏర్పాటు చేసినట్టు విదేశాంగశాఖ ప్రకటించింది. మరోవైపు ప్రవాసాంధ్రుల కోసం +91 8500027678, 0863 2340678 హెల్ప్ లైన్ నంబర్లు చేసినట్టు ఏపీఎన్‌ఆర్టీఎస్ వెల్లడిరచింది.