ఆదర్శ్ పుందిర్, అశ్రీత్ రెడ్డి, ప్రియాంకసింగ్, పూజిత పుందిర్, రాజ్‌గౌడ్, సునందిని, మధుసూదన్ ప్రధాన పాత్రధారులుగా ఓ చిత్రం రూపొందుతున్నది. సాంకేతికత, భావోద్వేగాలు, లింగ సమానత్వం, ఈ మూడింటి నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ఘంటసాల విశ్వనాథ్ దర్శకుడు. వేణుబాబు.ఏ నిర్మాత. ఈ సినిమా వివరాలను తెలిపేందుకు చిత్రయూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఘంటసాల విశ్వనాథ్ మాట్లాడుతూ స్ప్లాష్ కలర్స్ మీడియా బ్యానర్‌పై మేము చేస్తున్న తొలి చిత్రమిది. అశ్రిత్, ఆదర్శ్, ప్రియాంక సింగ్ ముఖ్యపాత్రలు పోషిస్తూ వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 26న మొదలు పెట్టుకుని 15 రోజులపాటు పగలు, రాత్రి షూటింగ్ చేస్తూ, ఇప్పటికి సగభాగం షూటింగ్ పూర్తి చేశాము. మిగతా సగభాగం షూటింగ్ కోసం యుఎస్ వెళ్తున్నాము. టెక్నాలజీ, ఎమోషన్, లింగ సమానత్వంపై ఉండబోతున్న ఈ చిత్రం 2025లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్రయత్నం చేస్తున్నాము. మా ప్రయత్నం అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నామని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: దిలీప్‌కుమార్ చిన్నయ్య, సంగీతం: పవన్‌చరణ్, జీవి.