హారర్ కామెడీ కథాంశంతో రాబోతున్న సినిమా ఓఎంజీ. ఓ మంచి ఘోస్ట్ అనేది ఉపశీర్షిక. వెన్నెల కిశోర్, నందితా శ్వేత, షకలక శంకర్, నవమి గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ, రఘుబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శంకర్ మార్తాండ్ దర్శకుడు. డా.అబినికా ఇనాబత్తుని నిర్మాత. త్వరలో సినిమా విడుదల కానుంది. ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమా టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు.
పూర్వజన్మ జ్ఞానంతో మళ్లీ జన్మ ఎత్తే అవకాశం ఏ జీవికి కూడా ఉండదు, దెయ్యాలకు మాత్రమే ఉంటుంది అనే డైలాగ్‌తో టీజర్ మొదలైంది. వెన్నెల కిశోర్ కామెడీ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని, ఇందులో దెయ్యంగా నందితా శ్వేతా నటిస్తున్నది మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఆండ్రూ, సంగీతం: అనూప్ రూబెన్స్, నిర్మాణం: మార్క్‌సెట్ నెట్‌వర్క్.