Namaste NRI

భారతీయులకు ఓ గుడ్ న్యూస్

బ్రిటన్‌కు వెళ్లాలనుకుంటున్న భారతీయులకు ఓ గుడ్ న్యూస్. వృత్తినిపుణుల వీసాకు సంబంధించిన నిబంధనలకు భారతీయులకు అనుకూలంగా సడలించేందుకు బ్రిటన్ సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై జరుగుతున్న చర్చల్లో భాగంగా ఈ అంశం తెరపైకి వచ్చింది. ఈ విషయమై కొంతకాలంగా రెండు దేశాల మధ్య ఉన్నతస్థాయిలో చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే, బ్రిటన్‌లో వలసల అంశం రాజకీయంగా సున్నితమైనది కావడంతో నిబంధనల సడలింపులు పరిమిత స్థాయిలోనే ఉండొచ్చన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వీసా నిబంధనలు సడలించేందుకు బ్రిటన్ ప్రభుత్వం సుముఖంగానే ఉన్నట్టు అక్కడి అధికారులతో చర్చల్లో పాల్గొన్న భారతీయ వర్గాలు వెల్లడించాయి. వలసలు, వాణిజ్యాణికి సంబంధించి ఇరు దేశాల మధ్య మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో బ్రిటన్‌లో కొంత సానుకూల వైఖరి కనిపిస్తోందని ఆ వర్గాలు వ్యాఖ్యానించాయి.

Social Share Spread Message

Latest News