Skip to main content

Namaste NRI

జపాన్ సీఈఓకు అల్లు అర్జున్ … స్పెషల్ గిఫ్ట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి తన సంస్కృతి పట్ల ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. జపాన్‌కు చెందిన గీక్ పిక్చర్స్ సీఈఓ టొమాట్సు కోసానోకు సీతారామ కళ్యాణం చిత్రపటాన్ని బహూకరించడం విశేషంగా నిలిచింది. శ్రీరామనవమి సందర్భంగా ఈ కానుకను అందించడం ద్వారా భారతీయ సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలను ప్రపంచానికి పరిచయం చేయాలన్న ఉద్దేశాన్ని అల్లు అర్జున్ వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా మన దేశ సంస్కృతి, ఇతిహాసాలు, శ్రీరాముడి కథ ప్రాముఖ్యత గురించి టొమాట్సు కోసానోకు వివరించినట్లు సమాచారం.

సీతారాముల కల్యాణం చిత్రపటం భారతీయ సంస్కృతికి ప్రతీకగా భావించబడుతుంది. అలాంటి పవిత్రమైన చిత్రాన్ని విదేశీ అతిథికి బహూకరించడం ద్వారా అల్లు అర్జున్ తనలోని ఆధ్యాత్మికతను, భారతీయ వారసత్వంపై ఉన్న గౌరవాన్ని మరొసారి చాటిచెప్పారు. దీనిపై అభిమానులు, సినీ వర్గాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఇటీవల భారతీయ సినిమాలకు అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న గుర్తింపు నేపథ్యంలో, ఇలాంటి సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాలు మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు ఈ విధంగా భారతీయ సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయడం విశేషంగా మారింది.

Social Share Spread Message

Latest News