Skip to main content

Namaste NRI

అమెరికాలో ఐటీ పారిశ్రామికవేత్తలతో APTS ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ భేటీ

అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన ఐటీ సర్వ్ లో ఐటీ పారిశ్రామికవేత్తలతో సమావేశమైన ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఐటీ పారిశ్రామికవేత్తలను మన్నవ మోహన కృష్ణ కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఐటీ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ఏపీలో ఐటీ విప్లవం రాబోతుంది. గూగుల్, క్వాంటం వ్యాలీ ప్రాజెక్టు లతో అద్భుత అవకాశాలు వస్తున్నాయి. పెట్టుబడులకు ఏపీ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తుందని, ఏపీలో కంపెనీలు ఏర్పాటు చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందడంతో పాటు యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. మీకు కావలసిన అన్ని అనుమతులు, మౌలిక సదుపాయాలు ప్రభుత్వం తరపున సమకూర్చు తామని మోహన్ కృష్ణ భరోసా ఇచ్చారు. మన్నవ మోహన కృష్ణ విజ్ఞప్తికి ఐటీ పారిశ్రామికవేత్తలు సానుకూలంగా స్పందించి, ఏపీ అభివృద్ధిలో భాగస్వాములు కావటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యూజెర్సీ ఐటీ సర్వ్ ప్రెసిడెంట్ రమేష్ గార్లపాటి మరియు ఐటీ సర్వ్ ప్రతినిధులు, తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News