అబుదాబి బిగ్ టికెట్ రాఫెల్ లో భారతీయ ప్రవాసుడు జాక్‌పాట్ కొట్టాడు. ఏకంగా 15 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్నాడు. మన కరెన్సీలో అక్షరాల రూ. 33.99కోట్లు. ఖతార్‌లో ఉండే భారతీయుడు ముజీబ్ తెక్కే మట్టియేరి కి ఈ జాక్‌పాట్ తగిలింది. సెప్టెంబర్ 27వ తారీఖున ముజీబ్ ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసిన సిరీస్ 256, లాటరీ టికెట్ నం. 098801 అతనికి ఈ అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. అయితే, లాటరీ నిర్వాహకులు భారత ప్రవాసుడికి ఫోన్ చేయగా అతడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదని తెలిపారు. విజేతగా నిలిచిన విషయం అతడికి చేరేవేసేందుకు వేరే మార్గల్లో ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.