Skip to main content

Namaste NRI

భారతీయ ప్రవాసుడికి జాక్‌పాట్

అబుదాబి బిగ్ టికెట్ రాఫెల్‌  లో భారతీయ ప్రవాసుడు జాక్‌పాట్ కొట్టాడు. ఏకంగా 15 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్నాడు. మన కరెన్సీలో అక్షరాల రూ. 33.99కోట్లు. ఖతార్‌లో ఉండే భారతీయుడు ముజీబ్ తెక్కే మట్టియేరి కి ఈ జాక్‌పాట్ తగిలింది. సెప్టెంబర్ 27వ తారీఖున ముజీబ్ ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసిన సిరీస్ 256, లాటరీ టికెట్ నం. 098801 అతనికి ఈ అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. అయితే, లాటరీ నిర్వాహకులు భారత ప్రవాసుడికి ఫోన్ చేయగా అతడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదని తెలిపారు. విజేతగా నిలిచిన విషయం అతడికి చేరేవేసేందుకు వేరే మార్గల్లో ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

Social Share Spread Message

Latest News