అమెజాన్‌లో కీలక మార్పు చోటు చేసుకుంది. వరల్డ్ వైడ్ కన్సుమర్ బిజినెస్ సీఈవో దేవ్‌క్లార్క్ అమెజాన్‌కి గుడ్ బై చెప్పారు. 2022 జులై 1తో అమెజాన్‌తో పూర్తిగా ఆయన బంధం తెంచుకోనున్నారు. ఆ కంపెనీలో 23 ఏళ్లుగా వివిధ హోదాల్లో ఆయన పని చేశారు. 1999లో డేవ్‌క్లార్క్ అమెజాన్‌లో చేరారు. అప్పటికీ ఈ కామర్స్ రంగం ఇంకా శైశవ దశలోనే ఉంది. అప్పటి నుంచి జెఫ్ బేజోస్‌తో కలిసి పని చేస్తూ అంచెలంచెలుగా అమెజాన్‌ను ప్రపంచంలోనే అతి పెద్ద ఈ కామర్స్ కంపెనీ తీర్చిదిద్దారు. డేవ్‌క్లార్క్ తమ సంస్థను వీడి వెళ్తున్న విషయంపై అమెజాన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడిరది.