Skip to main content

Namaste NRI

అమెజాన్‌లో కీలక మార్పు..  23 ఏళ్ల బంధానికి

అమెజాన్‌లో కీలక మార్పు చోటు చేసుకుంది. వరల్డ్‌ వైడ్‌ కన్సుమర్‌ బిజినెస్‌ సీఈవో దేవ్‌క్లార్క్‌ అమెజాన్‌కి గుడ్‌ బై చెప్పారు. 2022 జులై 1తో అమెజాన్‌తో పూర్తిగా ఆయన బంధం తెంచుకోనున్నారు. ఆ కంపెనీలో 23 ఏళ్లుగా వివిధ హోదాల్లో ఆయన పని చేశారు. 1999లో డేవ్‌క్లార్క్‌ అమెజాన్‌లో చేరారు. అప్పటికీ ఈ కామర్స్‌ రంగం ఇంకా శైశవ దశలోనే ఉంది. అప్పటి నుంచి జెఫ్‌ బేజోస్‌తో కలిసి పని చేస్తూ అంచెలంచెలుగా అమెజాన్‌ను ప్రపంచంలోనే అతి పెద్ద ఈ కామర్స్‌ కంపెనీ తీర్చిదిద్దారు. డేవ్‌క్లార్క్‌ తమ సంస్థను వీడి వెళ్తున్న విషయంపై అమెజాన్‌ నుంచి అధికారిక ప్రకటన వెలువడిరది.

Social Share Spread Message

Latest News