Namaste NRI

గేమ్ ఛేంజ‌ర్ ట్రైల‌ర్‌ పై కీల‌క అప్‌డేట్

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్‌, దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్. ఈ సినిమా ను అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండ‌గా,  థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. భారీ బ‌డ్జెట్‌తో రాబోతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియార అద్వానీ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా,  సునీల్, ఎస్ జే సూర్య కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే మూవీ నుంచి టీజ‌ర్‌తో పాటు పాట‌ల‌ను విడుద‌ల చేయ‌గా,  సూప‌ర్ రెస్పాన్స్‌తో దూసుకుపోతున్నాయి. గేమ్ ఛేంజర్ ట్రైల‌ర్ ఎప్పుడు వ‌స్తుందా అని వెయిట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్‌కు మేక‌ర్స్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఈ మూవీ ట్రైల‌ర్‌ను న్యూ ఇయ‌ర్ కానుక‌గా జ‌న‌వ‌రి 02 సాయంత్రం 5.04 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా న్యూ ఇయ‌ర్ విషెస్ తెలుపుతూ కొత్త పోస్ట‌ర్‌ను పంచుకుంది.  ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events