Namaste NRI

సంక్రాంతి బరిలో అనగనగా ఒక రాజు

హీరో నవీన్‌ పోలిశెట్టి ప్రస్తుతం అనగనగా ఒక రాజు అనే కామెడీ ఎంటైర్టెనర్‌లో నటిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. మారి దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. సోమవారం మోషన్‌పోస్టర్‌ను విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ ఈ ఏడాది సంక్రాంతికి మా సంస్థ నుంచి వచ్చిన డాకు మహారాజ్‌ బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని నమోదు చేసింది. ఆ సెంటిమెంట్‌ని కొనసాగిస్తూ వచ్చే ఏడాది సంక్రాంతికి అనగనగా ఒక రాజు సినిమాను విడుదల చేస్తున్నాం. వచ్చే సంక్రాంతికి హీరో నవీన్‌ పోలిశెట్టి నవ్వుల పండుగను తీసుకురాబోతున్నాడని మోషన్‌ పోస్టర్‌తోనే అర్థమైంది. రేపు పండక్కి రానున్న అసలుసిసలు సంక్రాంతి సినిమా ఇది  అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి నిర్మాణం: సితార ఎంటైర్టెన్మెంట్స్‌, ఫార్చ్యూర్‌ఫోర్‌ సినిమాస్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events