విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన లైగర్ ఫ్యాన్‌డమ్ టూర్ వేడుక హన్మకొండలో జరిగింది. కథానాయిక అనన్యపాండే తెలుగులో మాట్లాడి అబిమానులను ఆకట్టుకున్నారు. దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ విజయ్ సినిమాలోనే కాదు నిజ జీవితంలోనూ హీరోనే అన్నారు. నిర్మాత చారి, నటుడు అలీ, విషు తదితరులు మాట్లాడారు. ఈ చిత్రం ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ వేడుకకి తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, హన్మకొండ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, డిప్యూటీ మేయర్ రిజ్వానా సుల్తానా పాల్గొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)