Namaste NRI

ఫ్యామిలీ స్టార్ నుంచి ప్రేమగీతం

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఫ్యామిలీస్టార్‌. ఆయనకు జోడీగా మృణాల్‌ ఠాకూర్‌ నటిస్తున్నారు. పరశురామ్‌ పెట్ల దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బేనర్‌పై దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తు న్నారు. చిత్రబృందం నందనందనా అంటూ సాగే ప్రేమగీతాన్ని విడుదల చేసి మ్యూజిక్‌ ప్రమోషన్స్‌ మొదలుపెట్టింది. ఈ పాటకు అనంత శ్రీరామ్‌ సాహిత్యం అందించగా, గోపీ సుందర్‌ స్వరాలు సమకూర్చారు. సిధ్‌ శ్రీరామ్‌ ఆలపించారు. ఏమిటిది చెప్పీ చెప్పనట్టుగా ఎంత చెప్పిందో.. సూచనలు ఇచ్చీ ఇవ్వనట్టుగా ఎన్నెన్నిచ్చిందో.. హృదయాన్ని గిచ్చీ గిచ్చక.. ప్రాణాన్ని గుచ్చీ గుచ్చక.. చిత్రంగా చెక్కింది దేనికో.. అంటూ సాగిన లిరిక్‌ యువతరాన్ని కట్టిపడేసేలా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ పాట ఫ్యామిలీస్టార్‌ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని మేకర్స్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు.  ఏప్రిల్‌ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కేయూ మోహనన్‌. ఎడిటర్‌: మార్తాండ్‌ కే వెంకటేశ్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events