పోలీసుల కళ్లుగప్పి తప్పించుకునేందుకు నేరగాళ్లు వేషాలు మార్చడం కామన్. ఫిలిప్పీన్స్‌లో మాత్రం నేరగాళ్లు తప్పించుకునేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఏకంగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని గుర్తుపట్టకుం డా ముఖాలనే మార్చేసుకుంటున్నారు. ఇందుకోసం ఇక్కడ అక్రమ దవాఖానలు కూడా వెలిశాయి. తాజాగా రాజధాని మనీలాతో పాటు పాసే నగరంలో ఇలాంటి రెండు దవాఖానలను పోలీసులు గుర్తించారు. అక్రమంగా ప్లాస్టిక్ సర్జరీలు చేస్తున్న వియత్నాంకు చెందిన ఇద్దరు, చైనాకు చెందిన వైద్యుడిని అరెస్టు చేశారు. నేరగాళ్ల ముఖాన్ని వీటిల్లో పూర్తిగా మార్చేస్తున్నారు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తున్నారు. కొత్త దంతాలు అమర్చు తున్నారు. చర్మం కూడా తెల్లగా మార్చేందుకు అధునాతన సాంకేతికతను వినియోగిస్తు న్నారు. వివిధ నేరాల కు పాల్పడి తప్పించుకున్న వారు, అక్రమంగా ఆన్‌లైన్ క్యాసినోలు, జూదం నిర్వహించే వారు వీటిల్లో ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటున్నారని పోలీసులు చెప్తున్నారు.