Namaste NRI

ఇస్రో అరుదైన ఘనత

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో విజయంతో నూతన సంవత్సరాన్ని ప్రారంభించింది. అంతరిక్ష ప్రయోగాల్లో అత్యంత క్లిష్టమైన కృష్ణ బిలాల (బ్లాక్‌హోల్‌) అధ్యయనమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి పీఎస్‌ఎల్వీ-సీ58 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఇస్రో కి అత్యంత నమ్మకమైన ఈ వాహకనౌక ద్వారా ఎక్స్‌-రే పొలారిమీటర్‌  ఉపగ్రహంతోపాటు మరో పది శాటిలైట్ల ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీంతో అమెరికా తర్వాత ఇలాంటి ప్రయోగం చేసిన దేశంగా భారత్‌ నిలిచింది. 2021లో ఐఎక్స్‌పీఈ పేరుతో నాసా ఈ తరహా ప్రయోగం నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తంచేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events