కెనడా లో భారత సంతతి కి చెందిన వ్యక్తికి అరుదైన గౌరవం దక్కింది. ఇండియా కు చెందిన రంజ్ పిళ్లై కెనడాలోని యుకాన్ టెర్రిటరీకి ప్రీమియర్‌గా ఎన్నికయ్యారు. ఈ నెల 8న జరిగిన ఎన్నికల్లో యుకాన్ లిబరల్ పార్టీ నేతలు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలోనే జనవరి 14న పిళ్లై ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో ఆ పదవిని చేపట్టనున్న 2వ భారత సంతతి వ్యక్తిగా రంజ్ పిళ్లై గుర్తింపు పొందారు. రంజ్ పిళ్లై పూర్వీకులు కేరళలో నివసించారు.
