Skip to main content

Namaste NRI

భారత సంతతి వ్యక్తికి అరుదైన గౌరవం

కెనడా లో భారత సంతతి కి చెందిన వ్యక్తికి అరుదైన గౌరవం దక్కింది. ఇండియా కు చెందిన రంజ్ పిళ్లై కెనడాలోని యుకాన్ టెర్రిటరీకి ప్రీమియర్‌గా ఎన్నికయ్యారు. ఈ నెల 8న జరిగిన ఎన్నికల్లో యుకాన్ లిబరల్ పార్టీ   నేతలు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలోనే జనవరి 14న పిళ్లై ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో ఆ పదవిని చేపట్టనున్న 2వ భారత సంతతి వ్యక్తిగా రంజ్ పిళ్లై గుర్తింపు పొందారు. రంజ్ పిళ్లై పూర్వీకులు కేరళలో నివసించారు.

Social Share Spread Message

Latest News