అమెరికా తెలుగు ఎన్నారై సైంటిస్టుకు అరుదైన గౌవరం దక్కింది. తెలంగాణలోని వరంగల్ జిల్లా చెర్లపల్లికి శాస్త్రవేత్తడా. సాంబ రెడ్డికి టెక్సాస్ ఏం అండ్ ఎం విశ్వవిద్యాలయం తమ అత్యున్నత పురస్కారం రీజెంట్స్ ప్రొఫెసర్ అవార్డుతో సత్కరించింది. ఈ యూనివర్సిటీలో ఆయన సేవలను గుర్తింపుగా ఈ అవార్డు ప్రదానం చేసినట్లు యూనివర్సిటీ వెల్లడిరచింది. ప్రస్తుతం ఆయన టెక్సాస్ ఏ అండ్ ఎం స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. 2008లో సాంబరెడ్డి ఈ యూనివర్సిటీలో చేరారు. ఎపిలెప్సీ న్యూరోథెరపాటిక్స్‌లో అధ్యయనాలు చేస్తూ న్యూరో స్టైరాయిడ్స్ విభాగంలో ఎన్నో పరిశోధనలు పూర్తి చేశారు.
