Namaste NRI

డొనాల్డ్ ట్రంప్‌కు షాక్‌.. అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్‌ నకు మరో షాక్‌ తగిలింది. 2021, జ‌న‌వ‌రి ఆరో తేదీన జ‌రిగిన క్యాపిట‌ల్ హిల్ అటాక్ కేసులో కొలరాడో కోర్టు ఇటీవలే సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ చేసేందుకు ఆయన అనర్హుడని ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా మరో రాష్ట్రం కూడా కొలరాడో కోర్టు తీర్పును పాటించింది. అమెరికా ప్రెసిడెంట్ ప్రైమరీ ఎన్నికల్లో రాష్ట్ర బ్యాలెట్‌కు ట్రంప్ అనర్హుడంటూ మైనే రాష్ట్రం  ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి 2024లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ట్రంప్‌ను అనర్హుడిగా ప్రకటించారు. మైనే అధికారుల తరహాలో మరికొన్ని రాష్ట్రాలు కూడా కొలరాడో తీర్పును పాటిస్తే మాత్రం ట్రంప్‌ అధ్యక్ష ఎన్నికల పోటీలకు అనర్హుడవుతారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events