అమెరికాలోని కాలిఫోర్నియా లో కాల్పుల ఘటన చోటుచేసుకున్నది. ఆల్మెడా నగరంలోని కిట్టి హాక్ రోడ్డు మార్గంలో ఉన్న ఓ ఇంట్లో ఈ ఘటన జరిగింది. కాల్పుల్లో ముగ్గురు మృతిచెందినట్లు ఆల్మెడా పోలీసులు వెల్లడించారు. ఈ కేసుతో లింకు ఉన్న ఓ అనుమానితుడిని అరెస్టు చేసినట్లు చెప్పారు. తమ పక్క ఇంట్లో కాల్పులు ఘటన జరిగినట్లు ఓ వ్యక్తి తమకు ఫోన్ చేశారని అల్మెడా పోలీసులు వెల్లడించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. కుటుంబసభ్యుల్లో చాలా మంది కి తూటాల గాయాలు అయినట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిలో చిన్నారులు కూడా ఉన్నారు. ఏ కారణం చేత అనుమానిత వ్యక్తి కాల్పులు జరిపాడో ఇంకా పోలీసులు నిర్దారించలేదు.