మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ఎమ్మెల్సీ కవిత పోరాట ఫలితమే పార్లమెంట్‌లో బిల్లు పెట్టారని బీఆర్ఎస్ ఎన్నారైల బృందం పేర్కొంది. మహేష్ బిగాలా ఆధ్వర్యంలో వివిధ దేశాల ఎన్నారైలు మహేష్ తన్నీరు, చందు తల్లా, హరీష్ రెడ్డి, సురేష్ కలిసి ఎమ్మెల్సీ కవితను అభినందించారు. అలాగే వివిధ అంశాలపై వారు చర్చించారు.ఎన్నారైలు మాట్లాడుతూ మూడు దశాబ్దాల నుంచి పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఎమ్మెల్సీ కవిత అలుపెరగని పోరాటం చేశారని, దాని ఫలితంగానే పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ బిల్లు ద్వారా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలవుతాయన్నారు.
