అమెరికాకు చెందిన నల్ల జాతి మహిళ గృహ హింస గురించి ఫిర్యాదు చేసేందుకు 911 ఎమర్జెన్సీ సేవలకు ఫోన్ చేసింది. అయితే ఆ ఫోన్ కాల్ ద్వారా ఆమె ఇంటికి వచ్చిన పోలీసులు అక్కడ జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆ మహిళనే షూట్ చేసి చంపారు. లాస్ ఏంజిల్స్‌లో ఈ ఘటన జరిగింది. 27 ఏళ్ల నియాని ఫిన్‌లేసన్ గృహ హింస గురించి 911 నెంబర్‌కు ఫోన్ చేసింది. బాయ్‌ఫ్రెండ్ వేధిస్తున్నట్లు ఆమె తన ఫోన్ కాల్‌లో ఫిర్యాదు చేసింది. లాంకెస్టర్‌లోని ఈస్ట్ ఎవన్యూలో ఉన్న అపార్ట్‌మెంట్‌కు పోలీసులు వెళ్లారు. ఆ ఇంట్లో ఉన్న వారు అరుస్తున్నట్లు గుర్తించారు.
డోర్ ఓపెన్ చేసిన పోలీసులకు నల్లజాతికి చెందిన నియాని తన చేతిలో ఓ భారీ కిచెన్ కత్తిని పట్టుకుని ఉన్నట్లు గుర్తించారు. 9 ఏళ్ల కుమార్తెను తొసివేసినందుకు భాయ్‌ఫ్రెండ్‌ను పొడిచేస్తా అని ఆ మహిళ బెదిరించింది. ఆ సమయంలో జరిగిన ఘర్షణలో పోలీసులు కాల్పులు జరిపారు. కుమార్తె ముందే ఆ మహిళను పోలీసులు షూట్ చేశారు. హాస్పిటల్‌కు తీసుకువెళ్లినా ఆమె మృతిచెందినట్లు డాక్టర్లు చెప్పారు.