Namaste NRI

వారానికి రూ.120 కోట్లు సంపాదిస్తున్న మహిళ

చైనాకు చెందిన ఓ మ‌హిళ  త‌న వీడియోల‌తో కోట్లు కోట్లు త‌న ఖాతాలో వేసుకుంటోంది. జెంగ్‌ జియాంగ్ జియాంగ్ అనే మ‌హిళ చైనా సోష‌ల్ మీడియాలో పాపుల‌ర్. వివిధ ర‌కాల ఉత్ప‌త్తుల‌ను ప్ర‌మోట్ చేస్తూ ఆమె చేసే వీడియోలు అంద‌ర్నీ అట్రాక్ట్ చేస్తున్నాయి. టిక్‌టాక్ లాంటి డోయున్ యాప్‌లో ఆమెకు 50 ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు. ఆ అకౌంట్‌లో ఆమె వీడియోల‌ను పోస్టు చేస్తూ మెరుపు వేగంతో ఉత్ప‌త్తుల్ని ప్ర‌మోట్ చేసింది.  కేవ‌లం మూడు సెక‌న్ల‌లోనే ఆమె ఎటువంటి ప్రాడ‌క్టు అయినా ప్ర‌మోట్ చేస్తుంది. క్ష‌ణాల్లోనే ర‌క‌ర‌కా ల ఉత్ప‌త్తుల‌ను త‌న వీడియోల్లో చూపిస్తుంది. ఆ వీడియోల‌కు ఆమె భారీ స్థాయిలో ఆర్జిస్తున్న‌ది. జెంగ్ ప్ర‌తి వారం సుమారు 120 కోట్లు సంపాదిస్తున్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. ర్యాపిడ్ ఫైర్ శైలిలో ఆమె చేసే వీడియో ల‌కు తెగ ఆదాయం వ‌స్తోంద‌ని ఆన్‌లైన్ నిపుణులు చెబుతున్నారు. ఆమె ప్ర‌మోష‌న్ టెక్నిక్‌తో ఉత్ప‌త్తులు కూడా చాలా వేగంగా అమ్ముడుపోతున్న‌ట్లు తెలుస్తోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events