హన్సిక మోత్వానీ ప్రధాన పాత్రలో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ సినిమా మహా. శింబూ కీలక భూమిక పోషించారు. మాలిక్ స్ట్రీమ్స్ కార్పొరేషన్, ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ పతాకంపై మదియళగన్ నిర్మించగా, యూఆర్ జమీల్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని జులై 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన మహ హన్సిక 50వ చిత్రం కావటం విశేషం. స్టార్ హీరో శింబు కీ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. మహ టీజర్, ట్రైలర్‌కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. గ్రిప్పింగ్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, కరుణాకరన్, తంబి రామయ్య ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందించగా, జె.లక్ష్మణ్ చాయాగ్రాహకుడిగా పని చేశారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)