Skip to main content

Namaste NRI

జూలై 22న మహా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

హన్సిక మోత్వానీ ప్రధాన పాత్రలో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్‌ సినిమా మహా. శింబూ కీలక భూమిక పోషించారు. మాలిక్‌ స్ట్రీమ్స్‌ కార్పొరేషన్‌, ఎక్స్‌ట్రా ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై మదియళగన్‌ నిర్మించగా, యూఆర్‌ జమీల్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని జులై 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. సస్పెన్స్‌ థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన మహ హన్సిక 50వ చిత్రం కావటం విశేషం. స్టార్‌ హీరో శింబు కీ రోల్‌ పోషిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.  మహ టీజర్‌, ట్రైలర్‌కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. గ్రిప్పింగ్‌ థ్రిల్లర్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో  శ్రీకాంత్‌, కరుణాకరన్‌, తంబి రామయ్య ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి  జిబ్రాన్‌ సంగీతం అందించగా, జె.లక్ష్మణ్‌ చాయాగ్రాహకుడిగా పని చేశారు.

Social Share Spread Message

Latest News