Namaste NRI

ఆ దేశంతో జ‌రిగిన అన్ని ఒప్పందాల‌ను ర‌ద్దు :  కిమ్

దేశ రాజ్యాంగాన్ని మార్చేయాల‌ని ఉత్త‌ర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ పిలుపునిచ్చారు. ద‌క్షిణ కొరియాను నెంబ‌ర్ వ‌న్ శ‌త్రుదేశంగా ఆ రాజ్యాంగంలో పేర్కోవాల‌ని కిమ్ ఆదేశించారు. పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ప్ర‌సంగి స్తూ ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. ద‌క్షిణ కొరియాను పూర్తిగా ఆక్ర‌మించాల‌న్న సందేశాన్ని కూడా ఆయ‌న ఇచ్చారు. ఆ దేశంతో జ‌రిగిన అన్ని ఒప్పందాల‌ను ర‌ద్దు చేయాల‌న్నారు. యుద్ధ మేఘాలు క‌మ్ముకున్న నేప‌థ్యంలో ద‌క్షిణ కొరియాను సంపూర్ణంగా ఆక్ర‌మించేయాల‌న్నారు. మ‌ళ్లీ రిప‌బ్లిక్ ఆఫ్ కొరియాను స్థాపించాల‌ న్నారు. పార్ల‌మెంట్ ప్ర‌సంగంలో భాగంగా ఆయ‌న ఓ ప్ర‌తిజ్ఞ కూడా చేశారు. కొరియా ద్వీప‌క‌ల్ప ఏకీక‌ర‌ణ స‌మ‌యంలో నిర్మించిన రీయునిఫికేష‌న్ స్థూపాన్ని కూల్చివేయాల‌ని కిమ్ పేర్కొన్నారు. ఆ భారీ స్థూపం నేత్రాల‌కు వేద‌న మిగులుస్తోంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events