సినీనటుడు, వైసీపీ నాయకుడు అలీ రాజకీయాలకు గుడ్ బై చెప్పాడు. ఇకపై సామాన్యుడిగానే ఉంటానని పేర్కొన్నారు. సినిమాలు, షూటింగ్ లు చూసుకుంటానని వెల్లడించారు. 20 ఏండ్ల పాటు తెలుగుదేశం పార్టీ లో పనిచేశానని, ఆ తరువాత వైసీపీ లోకి వచ్చానని తెలిపారు. 40 ఏండ్ల పాటు సినీ పరిశ్రమలో ఉన్నానని, నా సేవకు రాజకీయం తోడైతే పదిమందికి సాయమవుతుందని రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. 2019లో వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న అలీకి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వయిజర్ గా నియమించారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్‌కుగాని, అసెంబ్లీకి గాని అవకాశం వస్తుందని భావించారు. టికెట్ రాకపోవడంతో ప్రచారంలో ఎక్కడా కనిపించలేదు.
సీతాకొక చిలుక సినిమా ద్వారా బాలనటుడి సినీ రంగం ప్రవేశించిన అలీ వందలాది చిత్రాల్లో హాస్యనటుడిగా నటించారు. పలు చిత్రాల్లోనూ హీరోగా నటించారు. ఎస్‌వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో నిర్మించిన యమలీల సినిమా సూపర్, డూపర్ హిట్‌గా నిలిచింది.